నేడు టీడీపీ-జనసేన-బీజేపీ కీలక సమావేశం

ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో బిజెపి – టిడిపి – జనసేన కలిసి బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పొత్తులకు సంబదించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అతి త్వరలో అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక ఈరోజు విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నాయి. పొత్తును ప్రకటించిన అనంతరం ఈ మూడు పార్టీలు కలిసి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి.

ఈ భేటీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందీశ్వరితో పాటు కేంద్ర బృందం పాల్గొని సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. నిన్న కేంద్ర బృందంతో పవన్, పురందీశ్వరి వేర్వేరుగా భేటీ అయి చర్చలు జరిపారు. ఇక పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీ తో పాటు లోక్ సభ కు కూడా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఈరోజు పవన్ ఏమైనా క్లారిటీ ఇవ్వనున్నారా..అనేది చూడాలి.