నేడు ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ..ఏడుగురు ముఖ్యమంత్రుల డుమ్మా!

హాజరయ్యే ఉద్దేశ్యంలో లేని రాజస్థాన్, కేరళ ముఖ్యమంత్రులు

7 Chief Ministers Skip NITI Aayog Meeting Chaired By PM Modi

న్యూఢిల్లీః నేడు ప్రధాని ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ఏడుగురు ముఖ్యమంత్రులు దూరంగా ఉంటున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోగ్య కారణాలను చూపిస్తూ హాజరు కావడం లేదని పేర్కొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గైర్హాజరుకు కారణం చెప్పలేదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఢిల్లీలో శాసన అధికారాలపై కేంద్ర సర్కారు పట్టు ఉండేందుకు వీలుగా ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

పంజాబీ ప్రయోజనాల పట్ల శ్రద్ధ చూపించడం లేదని, అందుకే ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చెప్పారు. గత నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా భగవంత్ మాన్ పలు అంశాలను లేవనెత్తారు. వీటి పట్ల కేంద్రం నిర్లక్ష్యం చూపిస్తోందన్నది ఆప్ వాదనగా ఉంది. తెలంగాణ సీఎం కెసిఆర్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం లేదు. శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే స్పందిస్తూ ప్రతి పక్షాల సీఎం లు సమావేశానికి హాజరు కావడం లేదంటే, కేంద్రం వారితో సఖ్యంగా ఉండడం లేదన్నారు.