కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు – వివేక్

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ భారీగా జరిగింది. ఈ సభ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్బంగా జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారాని అన్నారు.

కేసీఆర్ అంటే కల్వకుంట్ల కమీషన్ రావు అని, కమీషన్ లేకుంటే రాష్ట్రంలో ఏ పని జరిగే పరిస్థితి లేదన్నారు. తన ప్రశ్నలకు కేంద్ర మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని కేటీఆర్ అంటున్నారని… అసలు ఆయనకు బుద్ధుందా అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల సంగతేందని కేటీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా కాంట్రాక్టర్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని పదే పదే తిట్టిన కేసీఆర్… ఇవాళ అదే కాంట్రాక్టర్లు దోచిపెడుతుంది నిజం కాదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు.