ఏపీలో బిజెపి పొత్తు ఫై సీఎం రేవంత్ కామెంట్స్

CM Revanth Reddy public meeting in Indravelli today

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి రాజకీయ పార్టీల పొత్తుల వ్యవహారం హాట్ హాట్ గా నడుస్తుంది. తాజాగా టిడిపి కూటమి తో బిజెపి జతకలవడం ఫై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు.శనివారం రాత్రి మేడ్చల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 400 స్థానాలు గెలుస్తామని చెప్పుకునే బీజేపీ ప్రతి రాష్ట్రంలో పొత్తులు పెట్టుకుంటుందని ఎద్దేవ చేశారు.

అన్ని స్థానాలు గెలిచే సత్తా ఉంటే.. ఏపీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకుందని ఈ సభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి మొత్తం అతుకుల బొంతలా మారిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.