చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి..అరెస్ట్ చేయాలి : దేవినేని

devineni uma
devineni uma

అమరావతి : రూల్స్ పాటించే వాళ్లు కౌంటింగ్ సందర్భంగా వైసీపీ ఏజెంట్లుగా కూర్చోవద్దని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఆరోపించారు. ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్న సజ్జల ఇలాంటి సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

నిబంధనలు పాటించేవాళ్లు ఎన్నికల ఏజెంట్లుగా వెళ్లొద్దని చెబుతున్నాడని… కూటమి పార్టీల ఏజెంట్లపై గొడవలకు దిగే వాళ్లే కౌంటింగ్ కు వెళ్లాలని సజ్జల సూచిస్తున్నట్టుగా ఉందని ఉమా విమర్శించారు. మనమేమీ రూల్స్ ను పాటించడం కోసం కౌంటింగ్ హాల్లోకి వెళ్లడం లేదని సజ్జల చెప్పడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. సజ్జల వ్యాఖ్యలు చూస్తుంటే, అతడికి చట్టంపై, ఈసీ నిబంధనలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు.