జగన్ అర్జునుడు కాదు.. భస్మాసురుడు – టీడీపీ

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. వైసీపీ పార్టీ తో సిద్ధం అంటూ వెళ్తుంటే..టిడిపి రా..కదలిరా అంటూ వెళ్తుంది. ఇలా ఇరు పార్టీలు ప్రజల్లోకి వెళ్తూ ఒకరి ఫై ఒకరు విమర్శలు చేస్తుకుంటూ వస్తున్నారు. తాజాగా టీడీపీ..జగన్ ఫై కీలక వ్యాఖ్యలు చేసింది.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసం. తుగ్లక్‌ విధానాలతో అతలాకుతలం. ఐదేళ్లలో రాష్ట్రం దారుణంగా దెబ్బతినడానికి కారణం `అనుభవంలేని జగన్‌ పాలన. అతను అర్జునుడో అభిమన్యుడో కాదు, భస్మాసురుడు.. విధ్వంసకుడు. ఓట్లేసిన ప్రజల నెత్తిన చేతులు పెడుతున్న ఘనుడు. బాబాయ్ ని చంపేసి.. తల్లి-చెల్లిని తరిమేసి, జనాల్ని నానా హింసలు పెడుతున్న జగనాసుర పాలన అంతం కావాలి’ అని టిడిపి పేర్కొంది.

మరోవైపు మంగళగిరిలో వైసీపీ నుంచి టిడిపిలోకి వలసల పరంపర కొనసాగుతోంది. యువనేత పిలుపుతో చాలామంది వైసీపీని వీడి టిడిపి తీర్థం పుచ్చుకుంటున్నాయి. వారందరికీ లోకేష్ భరోసా ఇస్తున్నారు.