రోడ్ల మరమ్మతుల ఫై జగన్ సమీక్ష..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు దారుణంగా ఉన్నాయని ..రోడ్ల మర్మత్తుల విషయంలో జగన్ సర్కార్ విఫలమైందని మొదటి నుండి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య జనసేన అధినేత రోడ్ల విషయంలో వైసీపీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. బహిరంగ సభలు నిర్వహించారు. ఇక సోమవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రోడ్ల మరమ్మతుల ఫై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రోడ్ల మరమ్మతుల పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధితశాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఫలితంగా వాహనదారులకు చక్కని రోడ్లు అందుబాటులోకి తేవాలని సూచించారు. రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. రోడ్లపై ఉన్న గుంతలను తక్షణమే పూడ్చాలని ఆదేశించారు. రాష్ట్రంలో 46వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని సూచించారు. జూన్ నాటికి రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పూర్తి కావాలని అధికారులకు ఆదేశించారు.