అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపి శాసనసభా పక్షం

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీడీపి శాసనసభా పక్షం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వనందున ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాక్షేత్రం నుంచే సమాధానం చెప్తామమని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పుకొచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే టీడీఎల్పీ భేటీలో తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ నిర్ణయం తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని చాటి చెప్పేందుకు అసెంబ్లీనే అనువైన వేదిక అని భావించిన టీడీపీ.. ఇప్పుడు ఆ వేదికను బహిష్కరించి.. పెద్ద తప్పు చేసిందని అంటున్నారు. అసెంబ్లీ ద్వారా ప్రజలకు మ్యాటర్‌ను వివరించడంలో టీడీపీ నేతలు ఫెయిల్ అయ్యారని టాక్ నడుస్తోంది. అధికార పక్షం ఆరోపణలను తిప్పి కొడుతూ.. యావత్ ఆంధ్ర లోకానికి సమాధానం చెప్పే ఏకైక వేదిక అసెంబ్లీ. అలాంటి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ద్వారా టీడీపీ నేతలు పెద్ద తప్పు చేశారని విశ్లేషిస్తున్నారు.