నవంబర్‌ 5న కేదార్‌నాథ్‌లో పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ: నవంబర్‌ 5వ తేదీన ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత కేదార్‌నాథ్‌ ఆలయానికి వెళ్లి, పూజలు చేస్తారని ప్రధానమత్రి కార్యాలయం(పీఎంవో) గురువారం తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని పునర్నిర్మించిన శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని ప్రారంభించి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొంది. అనంతరం రూ.130 కోట్లతో నిర్మించిన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు, రూ.180 కోట్లతో నిర్మించనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపింది. 2013లో సంభవించిన వరదల్లో ఆదిశంకరాచార్య సమాధి ధ్వంసమైందని పీఎంవో పేర్కొంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/