నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ

నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. మరో కొన్ని నెలల్లో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవెంద్ర ఫడ్నవిస్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రుల్లో కొందరికి రాష్ట్రాలలో లేదా జాతీయ స్థాయిలో పార్టీ పటిష్టతల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఎన్‌డిఎ నుంచి కొన్ని ప్రధాన పార్టీలు వైదొలిగిన దశలో ఇప్పుడున్న మిత్రపక్షాలకు తగు గౌరవం కల్పించేందుకు ఆయా పార్టీల నేతలకు కూడా మంత్రి పదవులు ఇచ్చేందుకు వీలుంది. సాధారణంగా మంత్రి మండలి భేటీకి కేబినెట్ స్థాయి హోదా మంత్రులు హాజరవుతారు. కొన్ని సందర్భాలలో స్వతంత్ర హోదాలోని మంత్రులు వస్తారు. సంబంధిత విషయాలపై నిర్ణయాలలో పాలుపంచుకుంటారు. సహాయ మంత్రులు ఈ భేటీకి రావడం జరగదు. అయితే ఇందుకు భిన్నంగా ఈసారి యావత్తూ మంత్రి మండలి కేబినెట్ హోదాలు, స్వతంత్ర, సహాయక మంత్రుల తేడా లేకుండా జరుగుతుంది.