కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్న తమిళసై

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై..ఈరోజు అధికారికంగా బిజెపి కండువా కప్పుకున్నారు. బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆమె బిజెపి లో చేరారు. చెన్నై లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె బిజెపి లో చేరగా..ఈ కార్యక్రమానికి తమిళనాడు బిజెపి అధ్యక్షులు అన్నామలై హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రెండు రోజులకే ఆమె తన గవర్నర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి రాజ్యాంగ పదవిలోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలకు తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై వెళ్లడం జరిగింది. ఇక ఐదేళ్ల పాటు తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు’ అని పేర్కొన్నారు.

‘తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తున్నందుకు బాధగా ఉంది. కానీ తప్పడం లేదు. తెలంగాణ ప్రజలందరూ నా అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు. ఎప్పుడూ తెలంగాణ ప్రజలను మరువను. అందరితో కలుస్తూ ఉంటా. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా’ అని మీడియాతో తెలుపడం జరిగింది. ఈరోజు తమిళసై ప్లేస్ లో తెలంగాణ ఇన్‌చార్జ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు తీసుకున్నారు.