సామూహిక జాతీయ గీతాలాప‌నలో పాల్గొన్న సిఎం కెసిఆర్‌

cm-kcr-participated-in-national-anthem-programme

హైదరాబాద్‌ః స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ‌ వ్యాప్తంగా సామూహిక జ‌న‌గ‌ణ‌మ‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. అబిడ్స్ జీపీవో స‌ర్కిల్ వ‌ద్ద ఈ ఉదయం సరిగ్గా 11.30 గంటలకు నిమిషయం పాటు జాతీయ గీతాలాప‌నలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీలు కేశ‌వ‌రావు, అస‌దుద్దీన్ ఓవైసీ, మంత్రులు మ‌హ‌ముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని విజ‌య‌వంతం చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/