నేడు సిరిసిల్లలో బండి సంజయ్ పర్యటన

bandi-sanjay-election-campaign-at-karimnagar

రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పర్యటించనున్నారు. ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ లో వడగండ్ల వానతో పంట నష్టపోయిన పొలాలను పరిశీలించనున్నారు. పంట నష్టంపై రైతులను అడిగి వివరాలు తెలుకోనున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రములో ఈదురు గాలులకు చెట్టు విరిగి చనిపోయిన ఎల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

ఇక నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ లేని ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని బండి సంజయ్ తెలిపారు. కేంద్రం నుంచి నిధులు ఇవ్వలేదనే సాకుతో కాలయాపన చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు కర్రలు కాల్చారని మండిపడ్డారు.