కరోనా నుండి కోలుకున్న తమిళనాడు గవర్నర్
ధైర్యం, సంకల్పం వల్లే కోలుకున్నారన్న వైద్యులు

చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ (80) కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. నిన్న రాత్రి ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ ఫలితాలు వచ్చినట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన చురుగ్గా ఉన్నారని, ధైర్యం, సంకల్పం వల్లే ఆయన త్వరగా బయటపడగలిగారని పేర్కొన్నారు. తమిళనాడు రాజ్భవన్లో మొత్తం 84 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. గవర్నర్లోనూ స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో రెండు వారాల క్రితమే గవర్నర్ ఐసోలేషన్లోకి వెళ్లారు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రి వైద్యులు ఆయనను 24 గంటలూ పర్యవేక్షిస్తూ వచ్చారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/