సోమ‌వారం నుంచి అసెంబ్లీ స‌మావేశాలు

Ashok Gehlot
Ashok Gehlot

జైపూర్‌: సోమ‌వారం నుంచి అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు సిఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. దీనికి సంబంధించి తాను ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్‌ క‌ల్రాజ్ మిశ్రాతో మాట్లాడాన‌ని, అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై త‌క్ష‌ణ‌మే నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరాన‌ని సిఎం గెహ్లాట్ చెప్పారు. రాజ‌స్థాన్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి దూకుడుకు క‌ళ్లెంవేసే చ‌ర్య‌లు, రాజ‌కీయ ప‌రిస్థితి స‌హా ప‌లు అంశాల‌పై అసెంబ్లీలో చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని రాజ‌స్థాన్ సిఎం గెహ్లాట్ తెలిపారు. తాము అభ్య‌ర్థించినా గ‌వ‌ర్న‌ర్ అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డాన్ని చూస్తుంటే.. ఆయ‌న‌పై ఏవో ఒత్తిళ్లు ప‌నిచేస్తున్నాయ‌నే అనుమానం క‌లుగుతున్న‌ద‌ని గెహ్లాట్ పేర్కొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/