జాతీయజెండాను ఆవిష్కరించిన పవన్ ‌కల్యాణ్‌

నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ హాజరు

జాతీయజెండాను ఆవిష్కరించిన పవన్ ‌కల్యాణ్‌
Pawan Kalyan-Independence Day

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం భరతమాత, గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. కాగా, కొవిడ్19 నేపథ్యంలో సామాజిక దూరం వంటి నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/