సుశాంత్‌ మృతి కేసుపై సీబీఐ విచారణ..కేంద్రం

సీబీఐకి అప్పగిస్తున్నామని సుప్రీంకు తెలిపిన కేంద్రం

sushant-singh-rajput

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ హీరో సుశ్‌ాం సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసు దర్యాప్తును సీబీఐకీ అప్పగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు. సీబీఐ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ముంబై పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావని… ఈ కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, సుశాంత్ సొంత రాష్ట్రమైన బీహార్ ప్రభుత్వం కూడా సీబీఐ విచారణ జరిపించాలంటూ కేంద్రానికి సూచించింది. దీంతో, సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/