భారత పర్యటనకు రానున్న యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో భారత్‌లో యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బోరిస్‌ ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉన్నది. యూకే, భారత్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపే అవకాశం ఉన్నది. గత ఏడాది నవంబర్‌లో గ్లాస్గో వాతావరణ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధాని భేటీ అయ్యారు. వాస్తవానికి బోరిస్‌ జాన్సన్‌ గతేడాదే భారత్‌లో పర్యటించాల్సి ఉండగా.. రెండుసార్లు పర్యటన వాయిదా పడింది. గతేడాది జనవరిలో గణతంత్ర దినోత్సవానికి భారత్‌ ఆహ్వానించగా.. యూకేలో కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్‌లో పర్యటన ఖరారు కాగా.. భారత్‌లో కరోనా మళ్లీ కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రద్దయ్యింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/