ప్రతిరోజు 4500 కరోనా పరీక్షలు నిర్వహస్తున్నాం
జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం

అమరావతి: ఏపి వైద్య శాఖ మంత్రి ఆళ్లనాని జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో జిల్లా అధికారులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలపై ఆధికారులతో మంత్రి చర్చించారు. కోవిడ్ హాస్పిటల్లో ఏర్పాట్లు, భోజనాలు ఇతర శానిటేషన్పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని తెలిపారు. ప్రతి రోజు జిల్లాలో 4500 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పారదర్శకంగా వీలైనన్ని కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, కరోనా బాధితులను సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే వరకు వారి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వామే తీసుకుంటుదందని మంత్రి వెల్లడించారు.
కరోనా రోగులకు అందిస్తున్న భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవున్నారు. నాణ్యత లేకుండా ఆహారాన్ని సరఫరా చేస్తే కాంట్రాక్ట్ రద్దుతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన అధికారులను హెచ్చరించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/