పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జిత్ సింగ్

పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఎన్నికయ్యారు. ఆయన పేరును కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. కెప్టెన్ అమరిందర్ సింగ్‌ నిన్న సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కాంగ్రెస్ హైకమాండ్‌కు కొంత మేర తలనొప్పి తెచ్చిపెట్టింది. హైకమాండ్‌ ఎవర్ని ఖరారు చేస్తుందో అనే ఉత్కంఠ నెలకొని ఉండే..ఈ క్రమంలో హైకమాండ్‌ చరణ్‌జిత్ సింగ్ పేరును ఖరారు చేసింది.

వాస్తవానికి పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రులు వీరేనంటూ సుక్జిందర్ సింగ్ రంధావా సహా మరికొన్ని పేర్లు వినిపించాయి. అయితే వీరందరినీ కాదని చరంజిత్ సింగ్ చన్నీ పేరును కాంగ్రెస్ అధిష్టాణం ఖరారు చేసింది. హిందూ నేతను ఎంపిక చేయాల్సి వస్తే రాజ్యసభ సభ్యురాలు అంబికా సోని పేరు ప్రతిపాదించే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సిక్కు నేతకే సీఎం పగ్గాలు ఇవ్వాలని అంబికా సోని అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది.