ఎస్‌సి, ఎస్‌టి చట్టంపై సుప్రీం సంచలన తీర్పు

Supreme court
Supreme court

న్యూఢిల్లీ: ఎస్‌సి, ఎస్‌టి చట్టంపై నేడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక సవరణ చట్టానికి రాజ్యంగబద్ధత ఉందని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు ప్రాథమిక విచారణ అవసరం లేదని, సీనియర్ పోలీసు అధికారుల అనుమతి అవసరం లేదని పేర్కొంది. కాగా ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా విమిర్శలు రావడంతో ఈ చట్టానికి కోరలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సవరణలు ప్రతిపాధించింది. దేశంలోని ప్రతి పౌరుడు తోటి పౌరులను సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని, సోదర భావనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ రవీంద్ర భట్ ఒక తీర్పులో చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/