ప్రధాని మోడీ పై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రధాని మోడీ ఫై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ అంటే తనకు ఎంతో గౌరవమని పదే పదే చెప్పే పవన్..ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు.

తనకు ఇష్టమైన శేషేంద్ర శర్మ చెప్పిన కవితా పంక్తులను ఉటంకిస్తూ.. ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ .. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్థానానికి అద్దంపడతాయన్నారు. క్లిష్ట సమయంలో దేశ ప్రధానిగా పాలన చేపట్టి.. ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు అన్నింటినీ అర్థం చేసుకొని అన్నిటిని సమానంగా ఆదరించి.. ప్రతి ఒక్కరిలో భారతీయులం అనే భావనను నింపారని హర్షం వ్యక్తం చేశారు.

అంతేకాదు దేశంలో ప్రజారోగ్యానికి వాటిల్లిన విపత్తు, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణకు అహరహం తపించారు. ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి నరేంద్ర మోడీ అంటూ.. కరోనా సమయంలో ప్రధాని తీసుకున్న చర్యలను.. సరిహద్దుల విషయంలో చేపట్టిన విధానాలను పవన్ ప్రశంసించారు.

ఇక రీసెంట్ గా మోడీ ..వైజాగ్ పర్యటన కు వచ్చిన క్రమంలో పవన్ కళ్యాణ్ మోడీ ని కలవడం జరిగింది. దాదాపు 30 నిమిషాల పాటు వీరిద్దరూ భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియా తో పవన్ ..ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని తెలుపడం జరిగింది. మరి వీరిద్దరి భేటీ ఏ ఏ అంశాలు మాట్లాడుకున్నారనేది తెలియదు.