ఏపీ అప్పులపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

ఏపీ అప్పులపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. నేడు జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. కొవ్వూరు లో జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పులు గ్రోత్ రేట్ గతంలో కంటే తక్కువ ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు అండగా ఉండండని.. ఒక్క జగన్ పై తోడేళ్ల అందరూ కలిసి వస్తున్నారని వివరించారు.

రాబోయే రోజుల్లో దేశానికి ఏపీ దశదిశ చూపించబోతుందన్నారు జగన్. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్‌ కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అన్నారు. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయని అభిప్రాయపడ్డారు. వివక్ష పోవాలన్నా పేదరికం పోవాలన్నా చదవన్నదే గొప్ప అస్త్రమని తెలిపారు.

పిల్లల్లో చదువును ప్రోత్సహించేందుకే విద్యా దీవెన తీసుకొచ్చామన్నారు. ఈ పథకంతో 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 703 కోట్లు జమ చేస్తున్నామన్నారు. విద్యా దీవెన ద్వారా నాలుగేళ్లలో రూ. 10, 636 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.