కరోనాపై రిపోర్టింగ్‌ ఇచ్చే జర్నలిస్టు అదృశ్యం

Chen Qiushi china reporter
Chen Qiushi china reporter

వుహాన్‌: చైనాలో కరోనాపై వార్తలను సేకరిస్తున్న ఓ జర్నలిస్టు అదృశ్యమయ్యాడు. అతడు అదృశ్యమయిన విషయాన్ని అతడి స్నేహితులు వెల్లడించారు. కాగా చైనాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలను కరోనా వైరస్ వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా గురించిన పలు విషయాలను చైనా దాచి పెడుతోందని ప్రచారం జరుగుతోన్న సమయంలో ఓ జర్నలిస్టు కనపడకుండా పోవడం చర్చనీయాంశమైంది. కరోనా వైరస్ అధికంగా ఉన్న వూహాన్ నగరంలోనూ ఉంటూ ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ చేస్తోన్న ఇద్దరు చైనా జర్నలిస్టుల్లో ఒకరైన ఛెన్ కియుషి అదృశ్యమయ్యారు. ఆయన చెప్పిన వార్తలు సామాజిక మాధ్యమాల్లోనూ అధికంగా కనపడేవి. ఆయన ఏమయ్యాడో తెలియడం లేదు. వూహాన్‌లో కరోనా వార్తలను తెలపడంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా మృతులకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేయడంతో అతడిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. గురువారం రాత్రి ఏడు గంటల నుంచి అతడు కనబడడం లేదని అతని స్నేహితులు చెబుతున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/