తెలంగాణ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కృష్ణా ట్రిబ్యున‌ల్ నియామ‌కంపై దాఖ‌లు చేసిన‌ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది. కృష్ణా జ‌లాల పంప‌కంపై కొత్త ట్రిబ్యున‌ల్ కోరుతూ గ‌తంలో తెలంగాణ‌ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. అయితే ఈ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి.

ట్రిబ్యున‌ల్ ఏర్పాటుపై ప్ర‌స్తుతం ఆదేశాలు ఇవ్వ‌ట్లేద‌ని సుప్రీంకోర్టు తెలిపింది. అభ్యంత‌రాల దాఖ‌లుకు ఏపీ, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాలు అవ‌కాశం కోరాయి. దీంతో అభ్యంత‌రాల దాఖ‌లుకు ఆ రెండు రాష్ట్రాలకు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. పిటిష‌న్ ఉప‌సంహ‌రించుకుంటే కొత్త ట్రిబ్యున‌ల్ ఏర్పాటును ప‌రిశీలిస్తామ‌ని కేంద్రం తెలిపింది. కేంద్రం సూచ‌న‌తో పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి కోరింది. దీంతో త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి ఇచ్చింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/