సర్కారు వారి పాట సెన్సార్ పూర్తి..

యావత్ మహేష్ అభిమానులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , ట్రైలర్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేయగా..తాజాగా చిత్ర యూనిట్ సెన్సార్ కార్య క్రమాలను పూర్తి చేసింది. తాజాగా సినిమా చూసిన సెన్సార్ బృందం సినిమా కు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే సినిమా నిడివి వచ్చేసి 162 నిమిషాల 25 సెకన్లగా తేల్చారు. సినిమాలో మ‌హేష్ చాలా యంగ్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.

ఆయ‌న డైలాగ్స్ మాస్ స‌హా అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుకునేలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉండేలా డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా న‌టించింది. స‌ముద్ర ఖని విల‌న్‌గా న‌టించారు. విల‌న్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఎగ్గొట్టే ర‌కం అయితే అత‌న్నుంచి డ‌బ్బును వ‌సూలు చేసే బ్యాంకు మేనేజ‌ర్ పాత్ర‌లో మ‌హేష్ కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, రామ్ ఆచంట‌, గోపి ఆచంట సినిమాను నిర్మించారు.