‘మా’ ఎన్నికల ఫై రవిబాబు సంచలన వ్యాఖ్యలు

‘మా’ ఎన్నికల అంశం ఇప్పుడు మీడియా లో చర్చ గా మారింది. అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు , ప్రకాష్ రాజ్ లు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఇరువురు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు , దర్శకుడు రవిబాబు మా ఎన్నికల ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. మన క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు అవ‌కాశాలివ్వ‌కుండా.. ఇతర భాషల నుంచి నటులను తెచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

మన దగ్గర ఎంతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండగా.. మన దర్శకులు, నిర్మాతలు బయట వాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేవలం నటులలోనే కాదు. కెమెరామెన్‌లు, మేకప్‌మేన్‌లు.. ఇలా ఒక్కటేమిటి.. సినిమాకు సంబంధించిన చాలా విభాగాల్లో మన వాళ్లకంటే బయటవాళ్లకే ఎక్కువ ఛాన్స్‌లు ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.