ఎఫ్ 3 సెట్ లో బన్నీ సందడి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్2 చిత్రం ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికి తెలిసిందే. దానిని మించేలా ఎఫ్3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో వేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్ర సెట్ లో పుష్ప రాజ్ అల్లు అర్జున్ సందడి చేసారు. మంచి హిల్లేరియస్ సీన్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ సెట్స్‌కి వెళ్లి చిత్ర తారాగణంతో ముచ్చటించారు.

సినిమా షూటింగ్ వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, వెన్నెల కిషోర్, అనిల్ రావిపూడి తదితరులతో ఆయన ముచ్చటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఎఫ్2 లో నటించిన తమన్నా, మెహ్రీన్ లే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.