సన్నకారు రైతులను ఆదుకోవాలి

ప్రత్యేక యంత్రాంగం ఆవశ్యకత

Agriculture

భారతీయ సమాజం అన్ని రంగాలలో దినదినాభివృద్ధి సాధిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రత్యేకంగా వ్యవసాయరంగంలో సైతం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధిచెందడం వలన నేడు పెంపుడు జంతువులు లేకుండా మానవస్వశక్తి నిర్మిత పనిముట్లను వాడకుండా, కేవలం యాంత్రీ కరణతో, యంత్రాలనుపయోగించి వ్యవసాయం చేయడం జరు గుతుంది.

అలాగే పంటపొలాలకు వాడే విత్తనాల్లో ఎన్నో మార్పు లు చోటుచేసుకుంటున్నాయి.గతంలో విత్తనాలను వ్యవసాయ దారుడు తాను పండించిన పంటల నుండే తయారు చేసుకునే వాడు.

కానీ నేడు పరిణామక్రమంలో భాగంగా అలాంటి పరి స్థితి లేదు.

ఎన్నో ప్రైవేట్‌ కంపెనీలు తయారు చేసిన అధిక దిగుబడినిచ్చే, రోగనిరోధకశక్తిని కలిగివ్ఞంటే సంకరజాతి విత్తనాలు అధిక ధరలకు లభ్యమవుతున్నాయి.

అలాగే బిందు సేద్యమని, స్పింకర్లతో నీరుతడి పంటలు, వివిధ రకాల పండ్ల తోటలు,కూరగాయల పంటలు అమలులోకి వచ్చాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే నేటి వ్యవసాయం ఆహార పంటలకంటే ఆహారేతర పంటలైన వాణిజ్యపంటలకే అధిక ప్రాధాన్యతనివ్వ డం జరుగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది చిన్న రైతులు ఉంటే వారిలో దాదాపు 87 శాతం ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోనే ఉంటున్నారు.

రెండు ఎకరాలకన్నా తక్కువ పొలం ఉండేవారిని సన్నకారు కమతం, రెండు నుండి నాలుగు ఎకరాల మధ్య పొలం వున్నవారిని చిన్న కమతం అంటారు.

చైనాలో 19 కోట్లు, ఇండోనేషియాలో 1.7కోట్లు, బంగ్లాదేశ్‌లో1.7 కోట్లు, చిన్న కమతాల సంఖ్య 9 కోట్లపైగానే ఉన్నాయి.

2010-11 వ్యవసాయదారుల గణనప్రకారం రెండు నుండినాలుగు ఎకరాల చిన్నకారు కమతాల సంఖ్య 2.48 కోట్లు. ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల సన్నకారు కమతాల సంఖ్య9.28కోట్లు.

దేశంలో మొత్తం 13.83 కోట్ల వ్యవసాయ కమతాలుండగా వాటిలో 85.03 శాతం సన్నకారు, చిన్నకారు కమతాలే.

భారతదేశంలో మొత్తం 15.96 కోట్ల హెక్టార్ల సాగుభూమి వ్ఞండగా అందులో 7.11 కోట్ల హెక్టార్లు సన్నకారు, చిన్నకారు రైతుల ఆధీనంలో ఉంది.

ఇందులో ఒకటి నుండి రెండు ఎకరాల మధ్య 3.52 కోట్ల హెక్టార్ల భూమిఉంటే రెండు నుండి మూడుఎకరాల మధ్య 3.59 కోట్లు హెక్టార్ల భూమి కలదు.

దేశంలో 1960-61 ప్రకా రం దాదాపు 62 శాతం ఉన్న సన్నచిన్నకారు కమతాలు నేడు 85.03 శాతానికి చేరుకున్నాయి.

తెలంగాణా రాష్ట్రంలో 61.96 లక్షల హెక్టార్లల్లో 55.54 లక్షల కమతాలు గలవ్ఞ.నేడు వ్యవసాయమనేది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది.

సన్నకారు, చిన్నకారు రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకపోగా భూస్వాములు వ్యవసాయం చేయించే వివిధ సంస్థలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది.

మధ్య తరగతి కుటుంబాలకుచెందిన వ్యవసాయదారులకు ఈ యాంత్రీ కరణ వలన లాభాల్ని చేకూర్చకపోగా నష్టాలను తెచ్చిపెట్టడం జరుగుతుంది.

నేడు కొన్నిచోట్ల ప్రభుత్వాలే నేరుగా పంట ఉత్ప త్తిని కొనుగోలుచేస్తున్నాయి. కానీ దీనివల్ల సన్నకారు, చిన్నకారు రైతులకు ఒరిగే ఉపయోగమేమీ లేకుండాపోయింది.

ఎందుకంటే తాము పండించిన పంటలకుకావాల్సిన పెట్టుబడిని,పంట ఉత్పత్తిని వారికే అమ్మాలనే షరతులతో ముందుగానే మధ్యవర్తిత్వం వహించే దళారీ వ్యక్తుల నుండి తీసుకోవడం జరుగుతుంది.

అందుకే చిన్నకారురైతులు వ్యాపారస్తులకు కూలీలుగా మారాల్సి న దయనీయ పరిస్థితి,ఒక్కొక్కసారి కూలీసైతం మిగలక అప్పుల బారినపడి వడ్డీతో తలకు మించి భారంగా తయారవుతోంది.

కనుక ఏ ప్రభుత్వాలైన వ్యవసాయాభివృద్ధికి ఎలాంటి పథకాలు చేపట్టినా అవి చిన్నకారు రైతుల మేలుకోరే విధంగా ఉండాల్సిన అవసరం ఉన్నది.

ఆ పథక ప్రయోజనాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి.

సన్నకారు రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకా లపై సంపూర్ణ అవగాహన కల్పించడానికి ప్రత్యేక యంత్రాంగా న్ని ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.

  • డా.పోలం సైదులు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/