సాహితీ వెలుగు పాలగుమ్మి పద్మరాజు

నేడు పాలగుమ్మి పద్మరాజు వర్ధంతి

Palagummi padmaraaju (File)

పాలగుమ్మి పద్మరాజు చక్కని ముఖవర్చస్సు, చెదరని చిరునవ్ఞ్వ, తెల్లనిబట్ట, తెల్లనిలాల్చి, మనిషి మాత్రమే నలుపు మిగతా అన్ని తెలుపు. చిన్నపిల్లవాడి మనస్తత్వం అయినా ఎంతో పెద్ద మనసుతో ఆలోచిస్తారు. వీటన్నింటిని మించి కేంద్ర సాహిత్య అకాడమి అవా ర్డుని సొంతం చేసుకొన్నారు. పాలగుమ్మి పద్మరాజు 1915 జూన్‌ 24న పశ్చిమగోదావరి జిల్లా తిరుపతిపురంలో జన్మిం చారు. ఈయన తెలుగు కథ పుట్టిన ఐదేళ్లకి పుట్టారు. మరో 37ఏళ్ల తర్వాత తెలుగు కథని ప్రపంచ సాహిత్యస్థాయికి నిలబెట్టారు.

ఆయన చిన్నతనం నుంచి కూడా చదువ్ఞలో ఎప్పుడు ముందుండేవారు. ఎమ్‌.ఎస్‌.సిని విజయవంతంగా పూర్తి చేశారు. 1939-1952 మధ్యకాలంలో ప్రభుత్వం పి.ఆర్‌ కాలేజీలో సైన్సు లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. ఆయనకి చిన్నతనం నుంచి కూడా సాహిత్యం మీద ఆసక్తి మెండుగా ఉండేది. పుస్తక పఠనం బాగా చేసేవారు. సాహితీ వేత్తలందరితో చక్కని ప్రేమపూర్వక పరిచయాలు కొనసాగించే వారు. ప్రముఖ సాహితీవేత్తల పరిచయాలు, వారి ప్రసంగాలు చాలా చక్కగా ఆకళింపు చేసుకొనేవారు. ఈ గొప్ప లక్షణాలన్నీ ఆయన్ని అంతకంటే గొప్ప రచయితగా నిలబెట్టడంలో దోహ దం చేశాయని చెప్పవచ్చు.

ఆయన స్వయంగా చూసి చాలా దగ్గర సంబంధాలున్న వాటినే కథలుగా మలిచేవారు. ఇలా ఆయన బాల్యంలో చూసిన వ్యక్తుల్ని, వాళ్లతో దగ్గర సంబం ధాలు లేకపోయినా వాళ్లని గమనిస్తూ ఆ వ్యక్తుల్ని, అక్కడి సంఘటనల్ని ఆధారం చేసుకొని గాలివాన, బాల్యం, ఏ కథ తీసుకున్నా జరిగిన సంఘటనలే ఉంటాయి. ఇలా కొన్ని సూత్రాల్ని, లేదా ఆయనకు నచ్చింది చేద్దామనుకొని రాయా లని కూర్చున్నప్పుడు ‘ఒక్కొక్క పాత్ర ఆయన దగ్గరికి తన గురించి కథ రాయమని నన్ను అడిగేది అనేవారు. క్రమంగా ఆ పాత్రలలోకి వెళ్లి ఆయన అద్భుతంగా రచనలు చేశారు.

ఆయన కథల్లోని పాత్రలన్నీ కూడా ఆయన జీవితంలో ఆయన చేసినవే. ఆయన ఏ పనిచేసినా చాలా ఇష్టంగా, శ్రద్ధగా, చాలా ప్రొఫెషనల్‌గా చేసేవారు. ఎంతో ఆసక్తిగా టైలరింగ్‌ నేర్చుకొని టైలరింగ్‌ చేశారు. జీవితంలో అన్ని తనికి అవకాశం గా మలచుకొన్నారు. అలాగే దర్జి, వాళ్ల ఇంట్లో టేప్‌రికార్డరు దొంగలించిన వ్యక్తి, వారిఇంట్లో పనిచేసిన పనిమనిషి కల్పకం, ఇలా ఆయన జీవితంలో చుట్టూ చూసిన మనుషులందరు కూడా ఆయన కథల్లో పాత్రలుగా మారిపోయి అలా కథల్లో సజీవంగా ఉండిపోయా రు. అందుకే ఆయన దృష్టిలో లోపం లేకపోవ డం వల్లే ఆయన సృష్టిం చిన పాత్రల్లో కూడా బహుశా ఏ తారతమ్యం లేదు.

ఆయన దృష్టిలో మనుషుల్లో చెడ్డవారు, మంచివారు అని రెండు రకాలు ఉండరు. అంద రు మంచివారే అంటారు. అలాగే ఆయన అవమానా న్ని, సన్మానాన్ని, ఒకేలా చూడగల గొప్ప మనసున్నమహరాజు పాలగుమ్మి పద్మరాజు. అలాగే ఆయన మనుష్యుల్ని చూసేటు వంటి విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎవరు ఏ విషయం గురించి అడిగినా తనకు తెలియదు అని ఎప్పుడూ చెప్పలేదు. అంటే అంత అద్భుతమైన విషయ పరిజ్ఞానం ఆయనది.

సమాజంలో ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఈ అరుదైన వ్యక్తి రాసిన అనేక కథలను చాలా అద్భుతంగా రాసి సాహితీజిలుగు వెలుగుల్ని విశ్వవ్యాప్తం చేశారు.ఆయన కథలు గురించి తెలిసిన వారికి ఇంత సరళంగా ఇంత సింపుల్‌గా, ఇంత సులువ్ఞగా మన కళ్ల ముందు ఇంత సహజంగా ఈ కథ జరిగిపో యిందేమిటా అని అనిపించేంత గొప్పగా ఉంటుంది. పడవ ప్రయాణం కథ ఎప్పుడు చదివినా కూడా కొత్త అనుభవంగానే ఉంటుంది.

దీనికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ కథ ఎంత గొప్పది అంటే భారతదేశం లోనే గొప్పదర్శకుడిగా జాతీయబహుమతి పొందిన సేతుమాధ వన్‌ వారి దర్శకత్వంలో ఈ కథ సినిమాగా రూపాంతరం చెందింది. నేషనల్‌ ఫిల్మ్‌డెవలప్‌మెంటకార్పొరేషన్‌ వారు దానిని చిత్రంగా తీశారు. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్‌ రోహిణికి ఈ చిత్రానికి జాతీయస్థాయిలో బహుమతులొచ్చా యి. ఈ పడవ ప్రయాణం జాతీయస్థాయిలో ఎంతో మందిని ఆకర్షించింది. ఇది పాలగుమ్మి పద్మరాజు గారికి దక్కిన అరు దైన అదృష్టం.ఆయన అనేక రచనలు చేశారు.

ఆయన మొదటి కథ సుబ్బి.60 చిన్న కథలు రాశారు. వీటన్నింటిని గాలివాన, పడవ ప్రయాణం, ఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటలలో ప్రచురించారు.నవలలు అనేకం రాశారు. ఆయన కొన్ని తెలుగు సినిమాలకు కథలు, సంభాషణలు, సాహిత్యం రాశారు. వాటిల్లో బంగారుపాప, భాగ్యరేఖ, శాంతినివాసం, శ్రీ రాజరాజేశ్వరి విలాస్‌ కాఫీ క్లబ్‌, సర్దార్‌ పాపారాయుడు లాంటి ఎన్నో సినిమాలు బాక్సాఫీస్‌ బద్దలు కొట్టి రికార్డు సృష్టించాయి.

అలాగే ఆయన రాసిన చిన్నకథ సైక్లోన్‌ ‘న్యూయార్క్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ నిర్వహించిన 23 దేశాల నుండి వచ్చిన 53 కథల్లో ఈ కథ ఎంపికై అంతర్జాతీయ బహుమతిని గెల్చుకుంది. దర్శకుడిగా తన ప్రతిభతో రాణించి సాహిత్య వీధిలో ముందుగా వచ్చి అగ్రశ్రేణిలో స్థిరపడ్డారు పద్మరాజు. ఏ సాహిత్య రూపం తీసుకున్నా అది పద్మరాజుగారి చేతిలో మేలిమి బంగారం అయిపోయి ప్రతిభకు ప్రథమశ్రేణిలో నిలబడుతుంది. ఆయన అద్భుతమైన కవిత్వం కూడా రాశారు. ‘మిస్ట్రిక్‌ పొయిట్రీని అద్భుంగా రాసిన కవ్ఞల్లో పద్మరాజుగారు ప్రథమశ్రేణిలో ఉంటారు. పాలగుమ్మి పద్మరాజుగారు 1983 ఫిబ్రవరి 17న పరమపదించారు.
-పింగళి భాగ్యలక్ష్మి

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/