మూఢవిశ్వాసాలు శ్రేయస్కరం కావు

ఆధ్యాత్మిక చింతన

Lord Sri Rama
Lord Sri Rama

భరద్వాజ మహర్షి సలహాపై సీతారామ లక్షణులు చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు. శ్రీరాముడన్నాడు ‘లక్ష్మణా! మనం ఈ ప్రాంతంలోనే ఆశ్రమం ఒకటి ఏర్పాటు చేసుకుందాం.

అందులోనే ఒక పర్ణశాలను కూడా నిర్మించుకుందాం.

అందుకు అవసరమయ్యే కలపను సిద్ధం చెయ్యి అప్పుడు లక్ష్మణుడు రామాజ్ఞను శిరసావహించి వివిధ రకాలైన వృక్షాల నుండి కలపను సిద్ధం చేశాడు.

దాంతో పర్ణశాల ఒకటి నిర్మించాడు. రాముడన్నాడు ‘లక్ష్మణా! మనం ఈ పర్ణశాలలోనే చాలాకాలం ఉండాలని అనుకొంటున్నాను. అందువల్ల వాస్తుశాంతి కూడా చేస్తే బాగుంటుంది.

కనుక లేడి మాంసం తీసుకొనిరా. నైవేద్యం చేసి వాస్తు పూజ చేద్దాం. ఈరోజు మంచి ముహూర్తం. యజమానికి స్థిరత్వాన్నిస్తుంది .

లక్ష్మణుడు ఒక కృష్ణజింకను వేటాడి తెచ్చాడు. దాని మాంసాన్ని నిప్పులో వేసి పక్వం చేశాడు.

అంగవైకల్యం లేని జింక మాంసాన్ని రాముడి ముందుంచి) అన్నా! లేడి మాంసం పక్వం చేసితెచ్చాను. దేవతాపూజ చేయటానికి నువ్వేసమర్తుడివి) అన్నాడు.

రాముడు వాస్తుమంత్రాలను పఠించాడు. దేవతలందరినీ పూజించాడు. రుద్రుని, విష్ణువ్ఞని, విశ్వేదేవతలను ఉద్దేశించి బలులు సమర్పించాడు.

నియమానుసారంగా జపాలనీన చేశాడు. ఆ విధంగా వాస్తుకాంతి చేసి ఉత్తమ బలులు అన్నీ ఇచ్చి నదికిపోయి స్నానం చేసి వచ్చాడు.

ఈలోగా లక్ష్మణుడు ఆశ్రమంలో ఉండాల్సిన వేదికల్ని, చైత్యాలను, అగ్నిగృహాలను ఏర్పాటు చేశాడు.

అడవిలో లభించేపండ్లు, పుష్పాలను, మూలములను, ఉడికించిన మాంసాన్ని తెచ్చాడు. జలతర్పణాలతోను, వేదోక్త మంత్రాలతోను, దర్భలు, కుశలు, సమీధలతో శాస్త్రోకంగా భూతశాంతి చేశారు. తరువాత పర్ణశాలలోకి ప్రవేశించారు.

(పుట 192, 56వ సర్గ. అయోధ్యాకాండము, వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్రామాయణము-రామకృష్ణమఠం, హైదరాబాద్‌)

దీన్ని చూసి చూశారా, అవతార పురుషులైన సీతారామలక్ష్మణులే వాస్తుశాస్త్రాన్నీ, జ్యోతిషశాస్త్రాన్నీ గౌరవించారని, అనుసరించారని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలో రాశాడు అని అంటారు.

ముందు ఆ విషయాన్నంతా పూసగుచ్చినట్టు గ్రంథస్థం చేసిన వాల్మీకి మహర్షికి కృతజ్ఞతలు చెప్పి ఆ తర్వాత నిదానంగా, నిర్మలంగా, నిష్పక్షపాత దృష్టితో గమనిద్దాం.

అక్కడే చాలాకాలం ఉండాలన్న సంకల్పంతో శ్రీరాముడు వాస్తుశాస్త్రాన్నీ జ్యోతిషశాస్త్రాన్ని గౌరవించి అంతశ్రద్ధతో శాస్త్రానుసా రంగా చేయాల్సిన శాంతులు, బలులు, భూతశాంతు లు చేసి మంత్రాలను పఠిస్తే ఏమైందో తెలుసా? రామాణ పుటలనే తిప్పిచూద్దాం-

చిత్రకూటంలో తపస్సు చేసుకుంటున్న బుషుల్లో అంతకుపూర్వకం లేని భయం, అనుమానం చోటుచేసుకున్నాయి. కొందరు చిత్రకూటాన్ని వదలి వేరొకచోటుకు వెళ్లిపోయారు.

తనవల్ల ఏమైనా అపరాధం జరిగిందేమోనని రాముడు సందేహించి బుషీశ్వరుల్లో వృద్ధుడు గౌరవపాత్రుడు అయిన కులపతికి నమసరించి ‘ఓ మహానుభావా! నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తపోధనులెవ్వరికీ అసౌకర్యం కలిగించలేదు.

వాళ్లంతా నన్ను చూసి భయపడుతున్నట్లున్నారు. మావల్ల ఏదైనా అపచారం జరిగిదంటే సర్దుకుంటాం అన్నాడు.

అప్పుడు శ్రీరామునితో కులపతి నీవ్ఞ వచ్చి ఇక్కడ ఉండటం వల్ల ఖరుడు నీపట్ల చాలా అసూయగ వున్నవాడు, చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాడు.

అందుకు మేము ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టిపోతున్నాం.మీరు ఒంటరివారైపోతారు. మీరు కూడా మాతో రండి అని అన్నాడు.

అప్పుడు రాముడు సీతాలక్ష్మణులను కూడా మాతో రండి అని అన్నాడు.

అప్పుడు రాముడు సీతా లక్ష్మణులను కూడా సంప్రదించి చిత్రకూటపర్వతాన్ని విడిచిపెట్టి అత్రిమహాముని ఆశ్రమానికి చేరినారు.

(పుటలు 279-280-281 సర్గలు 116-117, అయోధ్యాకాండ ము-వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్రామాయణము రామకృష్ణమఠం, హైదరాబాద్‌)

అక్కడే చాలాకాలం ఉండాలని ముచ్చటపడి అత్యంత భక్తిశ్రద్ధలతో వాస్తుశా స్త్రాన్నీ, జ్యోతిషశాస్త్రాన్నీ అనుసరించి శ్రీరాముడు అన్ని చేస్తే అంత చేస్తే చివరకు అది మూడునాళ్ల ముచ్చటే అయిందని వాల్మీకి రామాయణం నుంచి బోధపడుతుంది.

ఇప్పుడు చెప్పండి వాస్తుశాస్త్రాన్ని గురించిగానీ, జ్యోతిషశాస్త్రాన్ని గురించిగానీ సాక్షాత్తు విష్ణుస్వరూపుడైన శ్రీరాముని కంటే ఎక్కువ తెలిసిన వారు ముల్లోకాల్లో ఎవరైనా ఉంటారా? .

మరి ఆయనే అలా చేస్తే ఫలితం దక్కిందా? ఆయన సంకల్పం నెరవేరిందా? రామాయణబోద, శ్రీరాముని చర్యలు, వాల్మీకి మహర్షి హృదయం ఇంకా మనకు అర్థం కాకపోతే ఎలా? మూఢవిశ్వాసాలు శ్రేయస్కరం కావు.

-రాచమడుగు శ్రీనివాసులు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/