ప్రపంచవ్యాప్తింగా 6.5 లక్షలు దాటిన కరోనా మరణాలు

worldwide corona

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తింగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. తాజాగా నిన్న ఒక్క రోజే 208042 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16397245కి చేరింది. నిన్న 4006 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 651580కి చేరింది. ప్రస్తుతం రికవరీ కేసులు కోటి దాటి… 10032806గా ఉండగా… యాక్టివ్ కేసులు 5712859గా ఉన్నాయి. వాటిలో 5646680 మందికి కరోనా లక్షణాలు తక్కువగానే ఉన్నాయి. 66179 మందికి కరోనా చాలా తీవ్రంగా ఉంది. కరోనా సోకిన వారిలో ప్రతి 100 మందిలో ఆరుగురు చనిపోతున్నారు. అమెరికాలో తాజాగా 50973 పాజిటివ్ కేసులు రాగా… మొత్తం కేసుల సంఖ్య 4366682కి చేరింది. మరణాలు 385 సంభవించాయి. మొత్తం మరణాల సంఖ్య 149783కి చేరింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/