బరువు తగ్గటానికి చిట్కాలు

ఆరోగ్యం- జాగ్రత్తలు

to lose weight

బరువు తగ్గడానికి అనేకమంది శతథా ప్రయత్నిస్తుంటారు. ఇందుకుకొన్ని చిన్నచిన్న చిట్కాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి అంటున్నారు అనేక పరిశోధకులు.

-వెననీలా పరిమళంతో చేసిన కొవ్వొత్తుల్ని ఇంట్లో వెలిగిస్తే, ఆ వాసనకు తీపి తినాలన్న కోరిక తగ్గుతుందని లండన్‌లోని సెయింట్‌ జార్జ్‌ హాస్పిటల్‌ పరిశోధన.

అలాగే తెలుపూ, నీలం ప్లేట్లకు బదులు ఎరుపు రంగు ప్లేట్లలో తింటే నలభైశాతం తక్కువగా తింటారట.

Tips to lose weight

స్లిమ్‌గా అందంగా ఉన్న అమ్మాయి ఫొటోని ఫ్రిజ్‌డోర్‌కి అతికించుకుంటే, అందులో నుంచి ఏవైనా తీసుకుని తినేముందు ఆ ఫొటోని చూస్తే తినడం తగ్గిస్తారట.

-టివి ముందో పుస్తకం చదువుతూనో తింటే ఎక్కువగా తింటారు. కాబట్టి తినేదానిమీదే దృష్టి పెట్టి తినడం వల్ల తక్కువగా తింటారనేది యూనివర్సిటీ ఆఫ్‌ లివర్‌పూల్‌ పరిశోధన.

Tips to lose weight
Tips to lose weight
  • నూనె వేసేటప్పుడు సుమారుగా కాకుండా స్పూన్ తో కొలిచి వేయడం వల్ల తప్పకుండా కొన్ని క్యాలరీలు తగ్గుతాయి. భోజనం ప్లేటు సైజుని తగించడం వల్ల కూడా రోజుకి సుమారు 160 క్యాలరీలు తగ్గుతాయి అంటున్నారు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ నిపుణులు
  • స్వీట్స్, చాకొలెట్లూ ఐస్‌క్రీములూ ఇంట్లో లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉంచినా వాటిని కనిపించకుండానో, అందని షెల్ఫులోనో పెడితే వాటిని వెతికి తీసే ఓపిక లేక తినాలన్నా కోరికా తగ్గిపోతుంది.
  • క్యాలరీల్ని పెంచే శీతలపానీయాలు సన్నని పొడవాటి గ్లాసుల్లో పోసుకంఉటే తాగే వేగం గతగ్గుతుంది. అదే మంచినీళ్లకి వెడల్పాటి పొట్టి గ్లాసుని పెట్టుకుంటే ఎక్కువగా తాగుతారట.
  • శరీరానికి కాస్త పనిని కూడా కల్పించాలి. ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోకుండా ఉండాలి.
  • ఇంట్లో కాస్త పనులు చేసుకుంటే ఆరోగ్యంతోపాటు లావు ను తగ్గించుకోవచ్చు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/