రజనీ ‘జైలర్‌’ నుంచి సునీల్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న మూవీ జైలర్‌. ఈ మూవీ లో టాలీవుడ్ నటుడు సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కమెడియన్ గా కెరియర్ మొదలుపెట్టిన సునీల్..హీరోగా కూడా పలు సినిమాలు చేసి మెప్పించాడు. ఇక ఇప్పుడు విలన్ గా మెప్పిస్తున్నాడు. అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప లో విలన్ గా అలరించాడు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మూవీ లో నటించే ఛాన్స్ కొట్టేసాడు.

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్’ లో సునీల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఆయన పాత్ర .. బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉండనున్నాయనే సంగతి ఈ పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఇక ఇతర ముఖ్యమైన పాత్రలలో రమ్యకృష్ణ .. శివరాజ్ కుమార్ .. యోగబాబు కనిపించనున్నారు. అలాగే ఈ మూవీ లో మోహన్ లాల్ నటిస్తున్నాడు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, ఏప్రిల్ 14వ తేదీన తమిళంతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు.