ప్రాజెక్ట్ కే నుండి దీపికా ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రాజెక్ట్ కె నుండి దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. బాహుబలి మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సాధించిన ప్రభాస్..ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ వంటి వరుస పాన్ మూవీస్ చేసి మరింత ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఒకటి , రెండు కాదు ఏకంగా నాల్గు పాన్ మూవీస్ ను లైన్ లో పెట్టాడు. వాటిలో ఆదిపురుష్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇక కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె, మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ మూవీస్ చేస్తున్నాడు.

ఈ మూడు కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్నాయి. వీటిలో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేస్తున్న ప్రాజెక్ట్ కె చాల ప్రత్యేకం. ఈ మూవీ ఎవెంజర్స్ తరహాలో ఉండబోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ లో ప్రభాస్ కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ నటి నటులు ఈ మూవీ లో యాక్ట్ చేస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా లో హీరోయిన్స్ గా బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకునే మరియు దిశా పటానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే దిశా తాలూకా ప్రీ లుక్ రిలీజ్ చేయగా..ఇక ఇప్పుడు దీపికా కు సంబదించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఇందులో దీపిక ఎంతో సీరియస్ గా కనిపిస్తోంది. ఆమె ఫస్ట్ లుక్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉందని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా టైటిల్ ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

రేపటి నుంచి యూఎస్ లోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకలు జరగనున్నాయి. అక్కడే ఈ నెల 20న సినిమా టైటిల్ తో పాటు, గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక, నాగ్ అశ్విన్, అశ్వనీదత్ పాల్గొననున్నారు.