ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్ – మారుతీ కలయికలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్ ) ఈ ఏడాది లోనే రిలీజ్ చేయబోతున్నారు. సాహో, రాధే శ్యామ్ మూవీస్ తో భారీ ప్లాప్స్ అందుకున్న ప్రభాస్..ప్రస్తుతం ఆదిపురుష్ మూవీ తో జూన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఈ సినిమా తో పాటు ప్రభాస్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె , మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ మూవీస్ చేస్తున్నాడు. ఈ మూడు చిత్రాలన్నీ ప్రస్తుతం సెట్స్ ఫైనే ఉన్నాయి. వీటిలో మారుతీ డైరెక్షన్లో చేస్తున్న మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా..ఇక మూడో షెడ్యూల్ షూటింగును ఈ నెల 27వ తేదీ నుంచి మొదలెట్టనున్నారని అంటున్నారు. మూడో షెడ్యూల్ షూటింగులో ప్రభాస్ తో పాటు మాళవిక మోహనన్ కూడా పాల్గొననుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ షెడ్యూల్ లో ఒక యాక్షన్ సీన్ కూడా ప్లాన్ చేశారట. ఇక ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.