చంద్రబాబు, పవన్ లది భార్యభర్తల అనుబంధం – మంత్రి అమర్నాథ్

వైస్సార్సీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుల ఫై దారుణమైన కామెంట్స్ చేసారు. చంద్రబాబు, పవన్ లది భార్యభర్తల అనుబంధం అని , టీడీపీ, జనసేన ఉమ్మడిగా ప్రచారం ప్రారంభిస్తే మంచిదని.. దీని వల్ల రెండు పార్టీలకు ఖర్చులు మిగులుతాయని సలహా ఇచ్చి వార్తల్లో నిలిచాడు. మొదటి నుండి కూడా మంత్రి అమర్నాథ్..పవన్ కళ్యాణ్ ఫై పలు విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన నేతలు , కార్యకర్తలు సైతం మంత్రి అమర్నాథ్ ఫై అదే రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. అయినప్పటికీ మంత్రి అమర్నాథ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.

తాజాగా మరోసారి ఆయన తన నోటికి పనిచెప్పారు. చంద్రబాబు, పవన్ భార్యభర్తల అనుబంధం అని , టీడీపీ, జనసేన ఉమ్మడిగా ప్రచారం ప్రారంభిస్తే మంచిదని.. దీని వల్ల రెండు పార్టీలకు ఖర్చులు మిగులుతాయని సలహా ఇచ్చారు. వారాహిపై పవన్ ఒక్కడే వస్తారో? చంద్రబాబుతో కలిసి వస్తారో? పవనే నిర్ణయించుకోవాలని అమర్నాథ్ అన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌కు ఆహ్వానం లేదన్నది టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనంటూ అమర్నాథ్ పేర్కొన్నారు. నవంబర్ 25వ తేదీన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నుంచి సీఎం జగన్‌కు ఆహ్వానం అందిందంటూ మంత్రి లేఖను చూపించారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖ లోనే గ్లోబల్ ఇండస్ట్రియల్ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోందని వివరించారు. ఐదు సంవత్సరాల పాటు దావోస్ వెళ్లి టీడీపీ ప్రభుత్వం సాధించింది శూన్యమంటూ మండిపడ్డారు.