తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం

అధిక ఉష్ణోగ్రతలు నమోదు

Summer has arrived
Summer has arrived

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. సాయంత్రం వరకు ఉదయ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ ఏడాది మార్చి నెల నుంచే వేడి సెగలు ఎక్కువైనాయి. ఇదిలావుండగా, ఏప్రిల్ నెల మొద‌టి వారం నుంచి ఎండ‌లు మ‌రింత తీవ్రం కానున్నాయ‌ని, అలాగే వ‌డ‌గాల్పుల ప్రభావం అధికంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణశాఖ అధికారులు తెలిపారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ‌ లో ఎక్కువగా ఎండలు మంటలు పుట్టిస్తున్నాయి. తాజాగా న‌ల్గొండ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్రత నమోదు అయింది. రానున్న 5 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ లో..

ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. అలాగే రానున్న 2 రోజుల్లో వడగాల్పులు తీవ్రత ఉంటుందని వాతావరం అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, మార్చి 21 నాటికి తుఫాన్ గా మారనుందని భారతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 23వ తేదీకి బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ తీరానికి చేరనుందని వాతావరణ శాఖ తెలిపింది.

అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/