మృత్యువుగా దూసుకొచ్చిన కారు : అక్కడికక్కడే మహిళ మృతి

హోలీ రోజున గచ్చిబౌలిలో విషాదం

The scene of the car accident
The scene of the car accident

Hyderabad: హోలీ రోజున తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక కారు అతివేగంగా దూసుకొచ్చి మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ దుర్ఘటన శనివారం జరిగింది. వివరాల ప్రకారం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదే హోటల్‌లో పనిచేసే మహిళను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

కారులో ఉన్న వారు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో యువకుడితో పాటు ఇద్దరు యువతులు ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. కాగా, ఆ మహిళ చెట్లకు నీళ్లు పెడుతుండగా, వేగంగా వచ్చిన కారు ఢికొట్టింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం :https://www.vaartha.com/andhra-pradesh/