ఏపి రాజధానిపై కెటిఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Minister KTR
Minister KTR

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కెటిఆర్‌ సంచలన ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో చాలా జిల్లాల విభజన చేశామని, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాక కొంచం కూడా వ్యతిరేకత రాలేదని చెప్పారు. ఏపిలో మూడు రాజధానుల అంశంపై మాత్రం ఆందోళనలు చేస్తున్నారని కెటిఆర్‌ అన్నారు. చాలా వ్యతిరేకత వస్తోందని, ఎందుకనేది ఆలోచించుకోవాల్సి ఉందని చెప్పారు. బిజెపితో జనసేన పొత్తుపై మీడియా ప్రశ్నించగా… ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏం చేస్తే మాకేంటీ? అని ప్రశ్నించారు. ఆ విషయాలన్నింటినీ ఏపి ప్రజలు చూసుకుంటారని వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/