అప్పుడే యశోద లాభాల్లోకి..?

సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం అప్పుడే లాభాల్లోకి వచ్చినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గ‌తేడాది ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని చాల రోజులే అవుతుంది. సరైన టైం చూసి రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్..నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసారు.

రిలీజ్ డేట్ ప్రకటించడం తో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు తిరగరాస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందట సమంత యశోద. రిలీజ్ కు ముందే యశోద నిర్మాతలకు ఏకంగా 8 కోట్ల రూపాయల లాభం వచ్చిందని టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.