బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్న సుమలత ..?

దక్షిణాదిన ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన సుమలత ..రాజకీయాల్లో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. భర్త అంబరీశ్ మరణంతో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అంబరీశ్ కాంగ్రెస్ నేత అయినప్పటికీ, ఎన్నికల్లో సుమలతకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇంట్రస్ట్ చూపించలేదు. దాంతో 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత మాండ్యా నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు.

ఇప్పుడు ఆమె బిజెపి లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయాన్నీ కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై చెప్పడం తో ప్రస్తుతం చర్చ గా మారింది. ఇప్పటికే బిజెపి నేతలు సుమలత తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రేపు కాదు ఎల్లుండి కానీ సుమలత మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను బిజెపి లో చేరబోయే విషయాన్నీ తెలుపనున్నట్లు వినికిడి. సుమలత బీజేపీలో చేరితే మాండ్యా జిల్లాలో బిజెపి కి మరింత బలం చేకూరడం ఖాయం అని బిజెపి భావిస్తుంది.