కొత్త బిజినెస్ మొదలుపెట్టబోతున్న రిలయన్స్

ప్రముఖ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇప్పటికే ఎన్నో వ్యాపారాలు మొదలుపెట్టి టాప్ రేంజ్ కి వెళ్లగా..ఇప్పుడు మరో బిజినెస్ మొదలుపెట్టబోతుంది. కొన్ని దశాబ్దాల కిందట దేశంలో సందడి చేసిన కాంపా డ్రింక్ ను మళ్లీ ప్రజల్లోకి తీసుకొస్తుంది రిలయన్స్. కాంపా బ్రాండ్ ను రిలయన్స్ సంస్థ ప్యూర్ డ్రింక్ గ్రూప్ నుంచి కొనుగోలు చేసింది. గతేడాది జరిగిన ఒప్పందంలో రిలయన్స్ రూ.22 కోట్లను ప్యూర్ డ్రింక్ గ్రూప్ కు చెల్లించింది.

భారత సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో 1980 సమయంలో కాంపా బ్రాండ్ హవా కొనసాగింది. ఏకచత్రాధిపత్యాన్ని కొనసాగించింది. అయితే 1990ల్లో విదేశీ సంస్థలైన పెప్సీ, కోకాకోలో భారత్‌లోకి అడుగుపెట్టాయి. దీంతో వాటి పోటీని కాంపా బ్రాండ్ తట్టుకోలేక కనుమరుగైపోయింది. ఇక ఇప్పుడు కొత్త డిజైన్ తో రిలయన్స్ సంస్థ మార్కెట్ లోకి తీసుకరాబోతుంది. వేసవి ప్రారంభమైన క్రమంలో కూల్ డ్రింక్స్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకునే ఆ డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు ఈ కాంపా బ్రాండ్ సాఫ్ట్ డ్రింక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ కాంపా డ్రింక్స్ 200ml, 500ml, 600ml, 1 లీటర్, 2 లీటర్ల ప్యాకులు, బాటిళ్లలో ఇవి అందుబాటులో ఉంటాయని రిలయన్స్ ప్రకటనలో తెలిపింది. 200 ఎంఎల్ బాటిల ధరను రూ.10గా నిర్ణయించారు. 500 ఎంఎల్ బాటిల్‌కు ధర రూ.20గా పేర్కొన్నారు.