సైరస్ మిస్త్రీ మృతి ఫై సంతాపం తెలిపిన జగన్

టాటా గ్రూప్ మాజీ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ ఆదివారం ముంబై సమీపంలోని పాల్ఘర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మృతి ఫై పలువురు రాజకీయ ప్రముఖులు, బిజినెస్ నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేయగా..తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైరస్ మిస్త్రీ కుటుంబ సబ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మిస్త్రీ ఒక గొప్ప వ్యాపార దిగ్గజమని కొనియాడారు. మిస్త్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఆదివారం మిస్త్రీ .. అహ్మదాబాద్ నుండి ముంబై వస్తుండగా ఆయన కారు డివైడర్ ను ఢీకొట్టింది. పాల్ఘర్‌లోని సూర్య నదిపై ఉన్న వంతెనపై ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీ అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. సైరస్ మిస్త్రీతో పాటు ముగ్గురు వ్యక్తులు ఆ కారులో ప్రయాణిస్తున్నారు. మిస్త్రీతో పాటు మరో వ్యక్తి కూడా మరణించినట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు గాయాలు పాలైనట్టు తెలిసింది. వారిని వెంటనే గుజరాత్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. సైరస్ మిస్త్రీ వయసు 54 సంవత్సరాలు.