ఈనెల 6న చిలకలూరిపేట నియోజకవర్గంలో పర్యటించబోతున్న సీఎం జగన్

సీఎం జగన్ ఏప్రిల్ 06 చిలకలూరిపేట నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. చిలకలూరిపేటలో ఈ నెల 6న ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు విడదల రజిని,ఎమ్మెల్సీ తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి లు చిలకలూరిపేట రూరల్ మండలం లింగంగుంట్ల గ్రామంలో పర్యటించి ముఖ్యమంత్రి గారి పర్యటన కోసం చేయవలసిన ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి యం. టి కృష్ణబాబు,ఆరోగ్యశ్రీ సీఈఓ హరింద్ర,జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్,జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి శోభారాణి,మరియు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.