ఈరోజే సుల్తాన్‌పూర్ మెడిక‌ల్ డివైజెస్ పార్క్ ప్రారంభం..

మేకిన్ తెలంగాణలో భాగంగా ఇప్పటికే ఎన్నో పరిశ్రమల స్థాపిస్తున్న రాష్ట్ర సర్కార్.. సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్కును ఈరోజు ప్రారభించబోతున్నారు.

ఈ పార్క్ లోని 7 ఫ్యాక్ట‌రీల ను ఈరోజు ప్రారంభిస్తారు. కాగ ఈ విష‌యాన్ని తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక గా ప్ర‌క‌టించారు. నేడు తెలంగాణకు గొప్ప రోజు అని కేటీఆర్ అన్నారు. నాలుగు ఏళ్ల క్రితం శంకు స్థాప‌న చేశామ‌ని.. ఈ రోజు ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు. భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక పార్కుకు ఇది ఒక పెద్ద మైలురాయి అని అన్నారు.

A big day for Telangana!

Very happy to announce that I will be inaugurating 7 factories in the Medical Devices Park, Sultanpur, today. This is a big milestone for India’s largest such industrial park, which I had the pleasure of launching 4 years ago.#TrailblazerTelangana pic.twitter.com/LxhjiLw53P— KTR (@KTRTRS) December 15, 2021