భీమ్లా నాయక్ నుండి రానా ప్రోమో రిలీజ్

దగ్గుపాటి రానా పుట్టిన రోజు (డిసెంబర్ 14) సందర్భాంగా భీమ్లా నాయక్ నుండి సరికొత్త ప్రోమో రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ‘వాడు అరిస్తే భయపడతావా.. ఆడికన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు.. దీనమ్మ దిగొచ్చాడా.. ఆఫ్ట్రాల్ ఎస్ఐ.. సస్పెండెడ్’ అంటూ రానా ఆవేశంతో చెప్పే డైలాగ్‌తో ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూస్తుంటే ఇందులో రానా పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందనేది అర్థమైపోతుంది. ఇందులో రానా డేనియల్ శేఖర్‌ నెగిటివ్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే.

రానా , పవన్ కళ్యాణ్ కలయికలో భీమ్లా నాయక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాగర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జనవరి 12 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

YouTube video