ఈరోజు క‌మ‌ల్ హాస‌న్ తో కేసీఆర్ సమావేశం

తమిళనాడు పర్యటన లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు బుధువారం మ‌క్క‌ల్ నీదిమ‌యం అధినేత, ప్ర‌ముఖ సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తో స‌మావేశం కానున్నారు. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి దర్శనానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మంగళవారం ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. కేంద్ర వ్యవసాయ విధానాలు సరిగా లేవని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని చర్చించుకొన్నట్టు తెలిసింది. ప్రజలకు ప్రాంతీయ పార్టీలే రక్ష అని అభిప్రాయపడ్డట్టు సమాచారం.

జాతీయ పార్టీలకు జాతీయ విధానాలే లేవని, ప్రాంతీయ పార్టీలకే ప్రజలపై శ్రద్ధ ఉన్నదని, అందుకే ప్రజలు వాటినే ఆదరిస్తున్నట్టు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్న 24 గంటల విద్యుత్తు, రైతుబంధు, కాళేశ్వరంపై స్టాలిన్‌కు కేసీఆర్‌ వివరించినట్టు సమాచారం. నేడు త‌మిళ‌నాడు లోని మ‌క్క‌ల్ నీదిమ‌యం అధినేత, ప్ర‌ముఖ సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తో స‌మావేశం కానున్నారు. కాగ సీఎం కేసీఆర్ త‌మిళ‌నాడు లో వ‌రుస భేటీ లో రాజ‌కీయం గా ఆస‌క్తి రేపుతున్నాయి.