వైకాపా తీరుతో కంపెనీలు వెనక్కి

భాజపా ఎంపీ సుజనా చౌదరి విమర్శ

BJP MP Sujana chowdary
BJP MP Sujana chowdary

Tirupati: ఏపీకి ప్రత్యేక హోదా అంటూ హోదా పేరుతో కొన్నిపార్టీలు రాజకీయం చేస్తున్నాయని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు
విమర్శించారు. శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు . ప్రత్యేక హోదాను వైసీపీ, టీడీపీలు రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. చంద్రబాబు ప్రధానమంత్రి అయినా ఏపీకి హోదా ఇవ్వలేరని , ఎందుకంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోదా కుదరదని ఆర్థిక సంఘం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టటానికి కంపెనీలు భయపడుతున్నాయని, ఉన్న కంపెనీలు వెళ్లిపోతున్నాయనిఅన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ దేశంలో ఏ ప్రభుత్వం ఇంతగా కోర్టులతో మొట్టికాయలు వేయించుకోలేదని అన్నారు. రాష్ట్రం నుంచి ప్రజలు వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రజలకు ఏం సాధించి పెట్టారని విమర్శించారు. బీజేపీని గెలిపిస్తే తిరుపతి అభివృద్ధి చెందుతుందని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/