తెలంగాణలో మరో కరోనా వైరస్‌ కేసు

బ్రిటన్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌

Coronavirus
Coronavirus

హైదరాబాద్‌: తెలంగాణలో మరో కరోనా వైరస్‌ కేసు నమోదయింది. బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో కరోనా పాజిటివ్ తెలంగాణలో ఆరుకి చేరింది. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే ఒకరికి గాంధీ ఆసుపత్రి వైద్యులు నయం చేసి డిశ్చార్జ్‌ చేశారు. విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు తప్పనిసరిగా స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు కనపడితే వెంటనే ఐసోలేషన్ వార్డులు తరలించి, నమూనాలను పూణెకు పంపుతున్నారు. కరోనా సోకిందని తేలితే వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణలో ఇప్పటికే ఐదుగురికి కరోనా సోకిన విషయం తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/